నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకునే యాత్రీకుల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీకి అనూహ్య స్పందన వస్తున్నది. కేవలం ఒక్క బస్సును మాత్రమే నడపాలని తొలుత నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణీకుల రద్దీ పెరగడంతో ఈ సంఖ్యను 30కి పెంచింది. వీటన్నింటిలోనూ సీట్లు భర్తీ అయ్యాయని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రత్యేక బస్సులన్నీ జులై 1, 2 తేదీల్లో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అరుణాచలానికి బయలుదేరుతాయని తెలిపారు. అరుణాచల టూర్ ప్యాకేజీ కోసం షషష.్‌రత్‌ీషశీఅశ్రీఱఅవ.ఱఅ వెబ్‌సైట్‌లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. జులై 3న గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి టీఎస్‌ఆర్టీసీ రెండు రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.