సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పూజలు

నవతెలంగాణ- మద్నూర్
సోమవారం నాడు గురు పౌర్ణిమ సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ పూజలు భక్తులు ఘనంగా నిర్వహించారు దంపతులతో ప్రత్యేక పూజలు ఆలయ పూజారి నిర్వహించారు. గురుపౌర్ణిమను పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్న ప్రసాదం నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయం భక్తుల తో కిటకిటలాడింది.