
రైతులు వర్షాలు లేక పంటలు నాటేందుకు అయోమయ పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. మండల కేంద్ర శివారులోని పంట పొలాలకు విస్తారకులు ఆర్కే ముని వన్నన్, అజిత్ దాస్ జైన్ లతో కలిసి వెళ్లి రైతులతి మంగళవారం మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీళ్లు లేక వరి నాటుకోలేని అయోమయ పరిస్థితి ఉందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు కాగా ప్రభుత్వం త్వరితగతిన కాలేశ్వరం ద్వారా అలీ సాగర్ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అంతకుముందు మండల కేంద్రంలో గడపగడపకు వెళ్లి బిజెపి ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలన సంక్షేమ పథకాలపై ప్రజలకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, రామకృష్ణ,పుట్ట శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, నాగభూషణం,ఎంపీటీసీ రాధా, అంకిత తదితరులు పాల్గొన్నారు.