వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు

– ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరన కేంద్రం తెలిపింది. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఆ జాబితాలో ఆదిలాబాద్‌, అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలున్నాయి.