ఇంటి నుండి భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు

– కాటేపల్లి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో వారి ఇంటి నుండి తెచ్చుకున్న భోజనం చేస్తున్న విద్యార్థులు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల మరియు పరిసర ప్రాంత గ్రామాలలో ఉన్న జిల్లా పరిషత్ మరియు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహించే కార్మికులు సమ్మెలో ఉండడంతో మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తమ ఇంటి నుండి భోజనం తెచ్చుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావిస్తున్నారు పేద విద్యార్థులు పౌష్టికాహారం లోపం లేకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో అమలు చేయకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమబాట చేపట్టారు దీనితో విద్యార్థులు తమ ఇంటి నుండే భోజనం తెచ్చుకుని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇకనైనా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కన్నా నిర్వాహకుల సమస్యలను తీర్చి పేద విద్యార్థులకు పౌష్టికి ఆహార లోపం లేకుండా మెరుగైన భోజనం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు.