మండల వ్యవసాయ అధికారి రాగమ్మ
నవతెలంగాణ-మొయినాబాద్
రైతులు రైతుబీమాను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాగమ్మా అన్నారు. గురువారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 18, 2023 లోపు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 18 నుంచి 59 ఏండ్లలోపు రైతులందరూ రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే రైతులు రైతుబీమా ఫారంతో పాటు రైతు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు , జిరాక్స్ కాపీలను జతచేసి ఆయా క్లస్టర్లకు సంబంధించిన రైతు వేదికలో వ్యవసాయ అధికారికి ఇవ్వాలని ఆమె సూచించారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చివరి తేదీగా ఆమె తెలిపారు. కావున అర్హులైన రైతులందరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకుని, సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.