నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మూడు రోజుల క్రితం టూ వీలర్ కు వేరొకరు ఢీకొట్టడంతో ఆయన కుడికాలు గాయమైంది. గాయపడ్డ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ ఇంటికే పరిమితం కావడంతో సలాబత్పూర్ గ్రామ సర్పంచ్ షేక్ గఫర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ హైమద్ హుస్సేన్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మొహమ్మద్ పటేల్ కలిసి సోమవారం మాజీ చైర్మన్ సొంత గ్రామం హెచ్, కేలూర్ సందర్శించి ఆయనకు పరామర్శించారు. గాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన మైనార్టీ నాయకులకు మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.