19 ఏండ్ల లోపు పిల్లలందరికీ ఆల్బెండొజాల్‌ మాత్రలు వేయించాలి

– జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
19 ఏండ్ల లోపు పిల్లలందరికీ ఆల్బెండొజాల్‌ మాత్రలు వేయించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం లోని కాన్ఫరెన్స్‌ హాలులో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం, మిషన్‌ ఇంద్రధనుష్‌పై జిల్లాస్థా యి టాస్క్‌ ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్‌ సబ్‌ సెంటర్ల పరిధి లోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలలో చదువు కుంటున్న విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు ఉచితంగా పంపిణీ చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నట్టు తెలి పారు. ఈ నెల 20వ తేదీన మాత్రలు పంపిణీ చేస్తామ ని, మరో దఫా 27న కూడా మాత్రలు పంపిణీ చేస్తామ ని తెలిపారు. 1-2 వయసు గల పిల్లలకు సగం టాబ్లెట్‌ తిన్న తర్వాత అందించాలన్నారు. 3-19 సంవత్సరాల పిల్లలకు ఒక టాబ్లెట్‌ అందించాలన్నారు.
అలాగే మిషన్‌ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరంలోపు పిల్లలందరికీ రోగ నిరోధక టీకాలు వేయాలని సూచించారు. మొదటి విడత ఆగస్టులో 07 నుంచి 12 వరకు, రెండవ విడత సెప్టెంబర్‌ 11 నుంచి 16 వరకు, మూడవ విడత అక్టో బర్‌లో 09 నుంచి 14 వరకు నిర్వహిస్తామని వివరిం చారు. శిశు మరణాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పాల్వాన్‌కుమార్‌, జిల్లా పం చాయతీ అధికారి తరుణ్‌కుమార్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులా ల అభివృద్ధి అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమ శాఖ అ ధికారి కోటాజి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సుధా రాణి, డీడబ్ల్యూఓ లలితకుమారి, డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ జీవరాజ్‌, డాక్టర్‌ అరవింద్‌ పాల్గొన్నారు.