మున్నూరు సోమవారం గ్రామంలో ఉద్రిక్తత

– ఎమ్మెల్యేను అడ్డుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు
– 24 గంటల ఉచిత విద్యుత్‌, లక్ష రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్‌
– ఎంపీటీసీ రవి, ధర్మపురం సర్పంచ్‌ అనిల్‌
నవతెలంగాణ-ధారూరు
మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామం లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పర్యటన సం దర్భంగా గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులపై అడగ డానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ రవి, ధర్మపు రం సర్పంచ్‌ అనిల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. ఎమ్మెల్యేను సమస్యలపై అడిగే ప్రయ త్నం చేయగా కార్యకర్తలపై ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్‌ కార్య కర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీటీసీ రవి సర్పం చ్‌ అనిల్‌ మాట్లాడుతూ..శాంతియుతంగా నిరసన చేప డుతున్న తమపై పోలీసులు దాడులు చేశారని ఆరోపి స్తూ కాంగ్రెస్‌ నాయకులు నిరసనకు దిగారు. పోలీసు లు నియంతలా పనిచేస్తున్నారని ఆరోపించారు.