– సీసీ కెమెరాల ద్వారా నిందితుల గుర్తింపు
– తాండూర్ పట్టణ పోలీసు సిబ్బందికి క్యాష్ రిపోర్టు అందజేసిన ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో జరిగిన భారీ చోరీ కేసును పట్టణం పోలీసులు 72 గంటలు ఛేదించారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడు తూ..డబ్బులకు ఆశపడి తెలిసిన వారి ఇంట్లో నలుగురు స్నేహితులతో కలిసి మొదటి చోరీ చేసి, చోరీ చేసిన డ బ్బును కొంత తీసుకొని మిగతా డబ్బును తర్వాత పం చుకోవాలని చెత్తకుప్పలో దాచి వెళ్ళిపోయారు. సీసీ కెమె రా ఆధారంగా అనుమానా నిందితుడి కదలికలను తాం డూరు పట్టణ పోలీసులు గుర్తించి, 72 గంటల్లోనే నిం దితులను రిమాండ్‌కు పంపించారు. తాండూరు పోలీ సులు. ఈనెల 13వ తేదీన పట్టణం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని మహమ్మద్ వాజిద్ అలీ ఇంట్లో రూ.20 లక్షల సొమ్ము దొంగతనం జరిగింది. ఈనెల 15 తేదీన వెలుగులోకి వచ్చింది. ఛాలెంజిగా తీసుకున్న పోలీసులు 72 గంటల్లోనే కేసును ఛేదించారు. పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆర్టిఐ కన్సల్టెంట్ వాజీద్ అని వ్యక్తి ఇంట్లో రూ.20 లక్షల దొంగతనం జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 13వ తేదీన హైదరా బాద్‌కు వెళ్లి వచ్చిన ఆయనకు డబ్బు చోరీకి గురైనట్లుగా గుర్తించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వాజీద్ అలీ కు ముందు నుంచి అబూబకర్ ఖురేషీ అనే వ్యక్తితో పరి చయం ఉంది. వాజిద్ దగ్గర కొన్ని రోజులుగా పనిచే సే వాడు. వాజిద్ ఇటీవల తన దగ్గర ప్లాట్ అమ్మిన డబ్బు లను రూ.20 లక్షలను ఇంట్లో ఉన్నట్లుగా ముందు నుం చే తెలుసుకున్న ఖుషేరి వాజిద్ కదలికలను పసిగ ట్టాడు. వాజిద్ హైదరాబాద్ వెళ్లిన వెంటనే ఖురేషి తాండూర్‌కి చెందిన ఎండి ఖలీల్, తౌసిప్, ఇందిరమ్మ కాలనీకి చెందిన దీపక్ అలియాస్ కిట్టుతో కలసి 13వ తేదీన రాత్రి 11 గంటలకు నలుగురు స్నేహితులతో కలిసి ఇంటి తాళాలను ఒక ఇనుప రాడునుతో తెరిచి లోపలికి వెళ్లారు. బీరువా తాళాలు అక్కడనే ఉండడంతో దానిని తెరిచి అందులో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. అనంతరం ఆటోలో సోఫియాస్, దీపక్ కిట్టులు ఆటో లో వెళ్లగా, అబూబాకార్, ఖలిల్‌లు పాత తాండూరు మాణిక్ నగర్ నుంచి పాత తాండూర్ వైపు వెళ్లారు ఫోన్లో నలుగురు మాట్లాడుకొని పట్టణంలోని యాదిరెడ్డి చౌరస్తా సమీపంలో ఉన్న పాడుబడిన 365 టోటల్ వద్దకు అందరూ చేరుకొని ఇంటి నుంచి తీసుకుని వచ్చి న డబ్బును నలుగురు పంచుకున్నారు. మిగతా రూ.19 లక్షలను అక్కడే ఉన్న చెత్త డబ్బాలో దాచి ఆటో బైకుతో పాటు చోరీకి ఉపయోగించిన వస్తువులతో పరారయ్యా రు. బాధితుడు వాజిద్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ రుసటి రోజు అనుమానంగా ఉన్న అబూబాకార్ కదలి కలను డిఎస్పి శేఖర్‌గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వ ర్యం లో ప్రత్యేక బృందాలతో సీసీ ల సహాయంతో విరివిరిగా పరిశీలించారు. చోరీ జరిగిన అనంతరం 365 హౌట ల్ వద్ద కలుసుకోవడం డబ్బులు దాచి పారిపోవడం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు అబూ బాకార్‌ను పోలీసులు అదుపులో తీసుకొని అరెస్టు చేశారు. మిగతా వారిని ఎండి ఖలీల్ కిట్టూలను కూడా అదుపులో తీసుకొని విచారించగా వాస్తవాలు వెల్ల డించినట్లుగా తెలిపారు. 72 గంటల్లో కేసును ఛేదిం చిన డీఎస్పీ శేఖర్ గౌడ్, సిఐ రాజేందర్ రెడ్డిలను ఎస్పీ అభినందించారు కేసులో చాక్యచక్యంగా పనిచేసిన పో లీస్ కానిస్టేబుల్ అంజద్, శివ, షబ్బీర్, సాయప్ప,లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు.