విద్యుద్ఘాతంతో ఆవు మృత్యువాత

నవతెలంగాణ-మొయినాబాద్‌
విద్యుద్ఘాతంతో ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన మండలంలోని నాగిరెడ్డి గూడాలో బుధవారం చోటు చేసుకుంది. బాధితులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన జీనికుంట సుధాకర్‌ లక్ష రూపాయలకు పాడిఆవును కొనుగోలు చేసి, జీవనోపాధి పొందుతున్నాడు. రోజువారి మాదిరిగానే తమ ఇంటి సమీపంలో ఉన్న పచ్చగడ్డి మేస్తూ ఆవు కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కన ఉన్న విద్యుత్‌ తీగెలు తగలడంతో విద్యుద్ఘాతంతో మృత్యువాత పడింది. ఆ రైతు కుటుంబ పోషణ ఆవు పాలపైనే ఆదారపడింద. ఆవు మృతిచెందడంతో ఆ రైతు బోరున విలపి స్తున్నాడు. తాను ఆర్థికంగా నష ్టపోయానని ఆందోళన వ్యక్తం చేశారు. సంబం ధిత అధికా రులు స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయం అందజేయాలని బాధిత రైతు కోరు తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.