నవతెలంగాణ గాంధారి
ప్రమాదవశాత్తు కుంటలో పడి మహిళ మృతి చెందిన సంఘటన గాంధారి మండలంలోని చిన్నపోతంగల్ గ్రామం లోచోటుచేసుకుంది గ్రామానికిచెందిన గొల్ల.పోచవ్వ (45) తన ఇంటి నుంచి బయలుదేరి పొలంలో పనిచేయడానికి వెళ్లి ఉదయం ఏడున్నర గంటలకు తన పొలనికి వెళ్ళింది ప్రమాదవశాత్తు పొలానికి ఆనుకొని ఉన్న కుంటలో పడి మృతి చెందినది మృతురాలి భర్త గొల్ల.సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి ఎస్సై సుధాకర్ తెలిపారు మృతురాలికి ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడికి వివాహము అయినది