కంపుగొడుతున్న గ్రామాలు

– గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం
– సమ్మెలో పంచాయతీ కార్మికులు
– పట్టించుకొని ప్రభుత్వం
అసలే వానకాలం.. వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు జీపీ కార్మికుల సమ్మెతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రోజు ఉదయాన్నే గ్రామాలను శుభ్రం చేసే కార్మికులు సమ్మె బాట పట్టడంతో వీధుల్లో చెత్తాచెదారం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడంతో గ్రామాలు కంపుగొడుతున్నాయి. ఇండ్ల మధ్యనే చెత్త ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యంపై కథనం.
నవతెలంగాణ-కందుకూరు
కందుకూరు మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 320 మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే వీరికి కనీస వేతనాలు అందడం లేదు. కొంతమంది గ్రామపంచాయతీ సిబ్బందికి మాత్రమే నెలకు రూ.8500 ఇస్తున్నారు. పదిమంది ఉంటే అందులో కేవలం నలుగురి, ఐదుగురికి మాత్రమే చెల్లిస్తున్నారు. వివి ధ గ్రామాల సర్పంచులు ఆ డబ్బులను ఒక్కొక్క కార్మికునికి రూ.1000, రూ.1500, రూ.2000, రూ.3000 అతి తక్కువగా చెల్లిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు పనికి తగ్గట్టు వేతనాలు రాకపోవడంతో కార్మికులు, చాలీచాలని జీతాలతో బతుకుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. దీంతో జీపీ కార్మికులు సమ్మె బాట పట్టారు.
20 రోజులుగా సమ్మె
తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ జీపీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 20 రోజులుగా సమ్మె బాట పట్టారు. మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కం దుకూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారు. రోజుకోక్క రూపంలో నిరసన తెలుపుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభు త్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.
కంపుగొడుతున్న గ్రామాలు
ఇదిలా ఉంటే జీపీ కార్మికుల సమ్మెతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మా రింది. మండలంలోని అన్ని గ్రామాల్లోని వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో దుర్గంధం వస్తోంది. ప్రతిరోజూ జీపీ కార్మికులు చెత్తను టాక్టర్లలో వేసుకొని గ్రామపంచాయతీ డంపింగ్‌ యార్డులో చెత్తను పారబోసేవారు. ప్రస్తుతం వారు సమ్మెలో ఉండడంతో గ్రామాల్లో చెత్తచెదా రం పేరుకుపోయి కంపు కొడుతున్నాయి. అసలే వర్షాకాలం.. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. ఈ క్రమంలో గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీపీ కార్మికుల సమ్మెపై స్పందిం చి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తాం
పంచాయతీ కార్మికుల సమస్యలు ప్రభు త్వం పరిష్కరించే వరకూ ఈ సమ్మె కొనసా గుతుంది. 19 రోజుల నుంచి పంచాయతీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. అధికారులు వేల వేల జీతాలు తీసుకొని కార్మికులకు రోజుకు కనీసం రూ.600 కూడా ఇవ్వలేరా.? కార్మికులకు రోజూ వంద రూపాయలు ఇస్తే ఎలా బతుకుతారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి.
– బుట్టి బాలరాజు, సీఐటీయూ మండల కన్వీనర్‌
మాకు వేతనాలు పెంచాలి
ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీలో దినసరి కూలిగా పనిచేస్తున్నాను. అయినా తగిన వేతనం రావడంలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నాం. పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. ప్రతిరోజూ కనీసం రూ.600 చెల్లించాలి.
– బాలరాజుగౌడ్‌, పంచాయతీ కార్మికులు, కందుకూరు
కుటుంబాన్ని ఎలా పోషించాలి?
15 సంవత్సరాల నుంచి పంచాయతీ కార్మి కుడిగా పనిచేస్తున్నాను. నాకు తగిన వేతనం రాక పోవడంతో కుటుంబాన్ని పోషించలే కపోతున్నా ను. 19 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వ స్పందించకపోవడం బాధాకరం. ప్రభుత్వం స్పందించే వరకూ సమ్మె చేస్తాం. మాకు వేతనాలు పెంచాలి. మా సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కారించాలి.
– యాదయ్య, కార్మికులు, ముచ్చర్ల