నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం-2024 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) ప్రకటించింది. వాటి స్వీకరణకు చివరి తేదీ వచ్చేనెల 31 వరకు ఉందని ఎన్‌డీఎంఏ సభ్య కార్యదర్శి కమల్ కిషోర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు ష్ట్ర్‌్‌జూర://aషaతీసర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఏటా జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోష్ జయంతి సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు. రూ.51 లక్షల విలువ గల మూడు అవార్డులతోపాటు సంస్థ లేదా వ్యక్తికి రూ.ఐదు లక్షల నగదు పురస్కారం ఇస్తామని పేర్కొన్నారు.