అబలకు నిర్వచనం…

అలుపు ఎరుగని శ్రమ జీవి తను
కుటుంబమే తన స్వర్గం అని
భావించే త్యాగ మూర్తి తను
తన వాళ్ల కోసమే తన ఆలోచన,
తన కలలు తన పిల్లల కోసమే
తన ఆవేదన వారి పరివారం కోసమే
తన వారి భవిష్యత్తుకై తన తపన..
తన మనిషి కోసం ఆమె ఆరాధన..
అలుపెరుగని ప్రయత్నం తనది
బాధ తో నిండిన బాధ్యత తనది.
శ్రమిస్తుంది తను గుర్తింపుకై
పరితపిస్తుంది తన వారి కోసమే
ఆశనే ఊరిపిగా మార్చి ఎదురుచూస్తుంది
అనురాగము కోసం పరితపిస్తుంది తను,
అలిసి పోయిన
శక్తిని పుంజుకొని
తనకు తానె అని శ్రమిస్తోంది
పరుల పనులను సూటి పోటీ మాటలను భరిస్తుంది
ఇతరుల మనసుని ఎప్పుడూ బాధించని సబల కానీ ఆమె ఎప్పుడూ అబలగానే మిగిలిపోతుంది
అణిచి వేతలకు గురి అవుతుంది
అభద్రత భావంతో జీవనం బ్రతుకుతుంది.

అబలకి స్వేచ్ఛగా గగన విహారం చేసేదెప్పుడో
ఆమెకు గౌరవం లభించేదెప్పుడో
స్త్రీ లేకపోతే జననం లేదు.
స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే అసలు సష్టే లేదు”. అని గుర్తించేదెప్పుడో కంటి పాపలా పిల్లలను కాపాడుకునే మాతమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…
– అనిత దావాత్‌, 9394221927