కాల్వపల్లి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన ఐటీడీఏ పిఓ అంకిత్

నవతెలంగాణ -తాడ్వాయి
విస్తీర్ణంగా కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న కాలువ పెళ్లి వరద బాధితులకు ఆదివారం ఐ టి డి పి ఓ అంకిత్ 80 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి పంపిణి చేశారు. పిఓ అంకిత్ మాట్లాడుతూ ఏ సంవత్సరం జరగని వర్ష బీభత్సం, ప్రకృతి ఇలా జరగడం చాలా విచారకరమని అన్నారు. వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఎస్ ఓ రాజ్ కుమార్, జే డి యం కొండలరావు, పంచాయతీ కార్యదర్శి రవి, కుల పెద్ద మనిషి ఆలం లక్ష్మయ్య, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, ఉప సర్పంచ్, యాలం మురళి, డైరెక్టర్, యాషాడపు మల్లయ్య, మాజీ సర్పంచులు యాలం శంకరయ్య, సిద్ధబోయిన శ్రీనివాసు, కుడుముల సారయ్య, కడవెండి సత్యం, కొప్పుల జగన్, కొప్పుల శ్రీనివాస్, సిద్దబోయిన నర్సింగరావు, కుడుముల రాజు, సిద్దబోయిన సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.