Uniform human code

కాలీ కాలని పచ్చిక మైదానంలో
అక్కడక్కడా అగుపించే
పచ్చని గరిక దేహాల్లా..
ఊరేగిన మానాలు భంగమై,
గుండెలు పగిలి ప్రాణం మిగిలిన
మనుషుల భవిష్యత్తు స్వప్నానికి
ఓ వాగ్ధానం చేద్దాము

తెగిపడున్న చేతులు, కాళ్లు
తడికలకెక్కిన శరణు కోరని తలలు
బురదలో కూరుకుపోయిన
అవయవాలు ఎవరివని ఆలోచించకు
ఏదొక దేహానికి అతికించి అంటుకట్టు
ఏకరీతి రక్త ప్రవాహం జరుగుతుంది
ముఖం, బాహువులు, తొడలు,
పాదాల ఆధారిత పుట్టుకలు రద్దై
ఏకరీతి రక్తాన ఏకమయ్యే
మనిషి సంగమాన
జాతి రహిత, వర్గ రహిత,
కుల రహిత, మత రహిత
కొత్త మనిషి మొలుస్తాడు
ఓ నవ మానవాళి తీగను అల్లుతాడు

వాడు కొమ్మల్ని విస్తరిస్తాడు ఏకరీతిన
రెమ్మల్ని అంకురిస్తాడు ఏకరీతిన
నీడనిస్తాడు ఏకరీతిన
కాస్తాడు ఏకరీతిన
పూస్తాడు ఏకరీతిన
హత్తుకుంటాడు ఏకరీతిన

చీవవస బఅఱటశీతీఎ ష్ట్రబఎaఅ షశీసవ
ఓ ఏకరీతి మానవ సమూహాన్ని
కూడదీసుకుందాము రండి

జరిగిన జీవన విధ్వంసం నుండి
ఓ ప్రయోజనాన్ని ఆశిస్తున్న ఆశావాదిని

– వెంకటేష్‌ పువ్వాడ, 7204709732