ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు కొత్త జడ్జీలు

నవతెలంగాణ -హైదరాబాద్‌
హైకోర్టుకు నూతనంగా నియమితులైన ముగ్గురితో అదనపు న్యాయమూర్తులుగా చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. లాయర్ల కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్‌ జూకంటి, లా ఆఫీసర్ల కోటా నుంచి సుజన కళాసికంలతో అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేయించారు. వీళ్లంతా భగవంతుని సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. తొలుత వీళ్లను జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన వారెంట్‌ను హైకోర్టు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ చదివారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తుల (ఫుల్‌కోర్టు) సమావేశం జరిగింది. కొత్త జడ్జీల ఫ్యామిలీ మెంబర్స్‌, న్యాయాధికారులు, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ నర్సింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ చైర్మెన్‌ పల్లె నాగేశ్వర్‌రావు ఇతరులు హాజరయ్యారు.