– జూలై 31, సెప్టెంబర్ 1 తేదీల్లో సమావేశం
– అతిథ్యం ఇవ్వనున్న శివసేన ఠాక్రే
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశానికి ముంబాయి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజరు రౌత్ తెలిపారు. ఈనెల 31 సాయంత్రం సమావేశం ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 1న 10 గంటలకు తిరిగి సమావేశం కొనసాగుతుందని చెప్పారు. మహా వికాస్ అఘాడి కూటమి శనివారం సమావేశమైన అనంతరం మీడియాతో సంజరు రౌత్ మాట్లాడుతూ, ముంబాయిలో జరిగే సమావేశానికి ఉద్ధవ్ ఠాక్రే ఆతిథ్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నేతలతో పాటు ఐదుగురు సిఎంలు ఆగస్టు 31న ఇచ్చే డిన్నర్లో పాల్గొంటారని, అనంతరం పాత్రికేయులతో సమావేశం ఉంటుందని అన్నారు. ముంబాయి సమావేశంపై చర్చించేందుకు మహా వికాస్ అఘాడి నేతలంతా శనివారం నాడు సమావేశమయ్యారని, సమావేశాల విజయవం తానికి నేతలందరూ ఒక్కో బాధ్యత చొప్పన తీసుకోనున్నారని చెప్పారు. ాగా, మహా వికాస్ అఘాడి సమవేశంలో ఎన్సిపి అధినేత శరద్ పవార్, ఆ పార్టీ రాష్ట్ర విభాగం చీఫ్ జయంత్ పాటిల్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే, శివసేన (ఠాక్రే) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సుభాష్ దేశారు, సంజరు రౌత్, కాంగ్రెస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ బాలాసాహెబ్ థరోట్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజరు వాడెట్టివార్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే హాజరయ్యారు. 26 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి తొలి సమావేశం పాట్నాలో, రెండో సమావేశం బెంగళూరులో జరుగగా, మూడో సమావేశం ముంబాయిలో జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.