పటేల్‌గూడకు బస్స్సు సౌకర్యం కల్పించాలి

– 15వార్డు కౌన్సిలర్‌, గ్రామస్తులు కలిసి
– డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-ఆదిభట్ల
ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీ పటేల్‌గూడ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆదిభట్ల మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్‌ కమాండ్ల యాదగిరి డిపో మేనేజర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఎంపీ పటేల్‌గైడ గ్రామానికి ఇబ్రహీంపట్నం బస్స్‌ డిపో నుంచి ఎంపీ పటేల్‌గూడ గ్రామానికి రావాల్సిన ఆర్టీసీ బస్సును నిలిపివేశారని తెలిపారు. దీంతో రైతులకు, విద్యార్థులకు, ప్రయివేట్‌ ఉద్యోగులు సిటికి వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేవారు. బస్సు సౌకర్యం కల్పించాలని సంబంధించిన అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా గ్రామా నికి బస్స్‌ను కొనసాగించాలని ఇబ్రహీంపట్నం బస్‌డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందించినట్టు వెల్లడించారు. ఎంపీ పటేల్‌గూడ గ్రామానికి కనీసం రోజుకు పన్నెడు ట్రిప్పుల చొప్పున నాలుగు బస్సులు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డొంకని శ్రీనివాస్‌గౌడ్‌, గజ్జెల నర సింహరెడ్డి, బోగీడి శ్రీశైలం, గడుసు ఎటయ్య, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.