– ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మళ్లీ కొనసాగిస్తాం సీఐటీయూ మండల కన్వీనర్ పొచమొని కృష్ణ
నవతెలంగాణ-మంచాల
పంచాయతీరాజ్ శాఖ మంత్రి హామీతో సమ్మె విరమించుకున్నామనీ, మంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోక పోతే 10 రోజుల్లో మళ్లీ సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ మండల కన్వీనర్ పొచమొని కృష్ణ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ, ఉద్యోగ కార్మికుల సమస్యల ప్రస్తావించి మూడు రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామని, సమ్మె విరమించుకోవాలనీ కోరినట్టు తెలిపారు. అందుకు గాను తాత్కాలికంగా సమ్మె వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల యూనియన్ మండలాధ్యక్ష, కార్యదర్శులు ఖాజా పాషా, దూసరి భాస్కర్, నాయకులు మాధవి, జంగయ్య, రవి, శంకరయ్య, జ్యోతి, యాదయ్య, సురేష్, కృష్ణ, దర్శన్, వెంకటయ్య, అర్జున్, చెన్నయ్య ఉన్నారు.