– శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ఆంగ్లం, గణితంలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయ, ఉపాధ్యాయునీలకు మొదటి రెండు రోజులు తెలుగు, మరో రెండు రోజులు గణితం, మరో రెండు రోజులు ఆంగ్లము లపై శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. చివరి ముగింపు మంగళవారం ఎంపీడీవో ముఖ్యఅతిథిగా హాజరై, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమంలో ప్రభుత్వం ఎంతో మెరుగు పరిచేందుకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం శుభ పరిణా మం అన్నారు. మనకు ఎంత తెలిసిన తెలి యని విషయాలు ఇంకా చాలా ఎన్నో ఉన్నాయని అలాంటివి కూడా ఈ శిక్షణలో నేర్చుకోవడం జరుగు తుందన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక విషయా లను తెలియచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, పర్వేద కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సురేందర్ రెడ్డి, రిసోర్చ్ పర్సన్ రవికాంత్ రెడ్డి, అచ్చమ్మ, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తాహేర్ అలి, ఆశీర్వాదం, అశోక్, దశరథ్ నాయక్, శ్రీనివాస్ రాజు, బాల థెరిస్సా, పద్మజ, నౌషీన్ సుల్తానా, యాస్మిన్, విజయ లక్ష్మి, వీణ, రాము శర్మ ,ఆరీఫ్, మునవర్ సుల్తానా, సధాలక్ష్మి, ప్రణీత పాల్గొన్నారు.