రేషన్‌ డీలర్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

– క్వింటాల్‌కు కమీషన్‌ ధరలను పెంచిన ప్రభుత్వం
– రాష్ట్ర మంత్రి హరీష్‌ రావును కలిసి కతజ్ఞతలు తెలియజేసిన రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు జూకా రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
రాష్ట్రంలో తెలంగాణ రేషన్‌ డీలర్లను తెలంగా ణ ప్రభుత్వం కమీషన్‌ పెంచి రేషన్‌ డీలర్లకు అండగా నిలిచింది. క్వింటాల్కు కమీషన్‌ ధరలు పెంచుతున్న ట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ డీలర్లకు కమిషన్లు పెంచ డంతో మంగ ళవారం సచివాలయంలో మంత్రి హరీష్‌ రావును కలిసి వికారాబాద్‌ జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్య క్షులు జూకా రెడ్డి, రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు రేషన్‌ డీలర్ల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రేషన్‌ డీలర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం క్వింటా లకు రూ.70 – 140లకు పెంచుతున్నట్లు ప్రకటిం చింది. గతంలో రేషన్‌ డీలర్లు రాష్ట్రంలో అనేకమార్లు భద్రత కల్పించాలని నిరసన కార్యక్రమాలు తెలిపిన సందర్భాలున్నాయన్నారు. గతంలో రేషన్‌ డీలర్‌ను ఆదుకోవాలని కోరుతూ అనేక సందర్భాల్లో వివిధ రకాల డిమాండ్లను ప్రభుత్వం దష్టికి తీసుకువ చ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్‌ డీలర్ల పాత్ర శ్రీలక్కమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదు కునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో రేషన్‌ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో రేషన్‌ డీలర్లకు మేలు జరగ నుంది. ప్రభుత్వం అందిస్తున్న మెట్రిక్‌ టన్నుకు ప్రస్తు తం 200 రాగ కమీషన్‌ పెరగడంతో అది 1400కు చేరుకోనుంది. రేషన్‌ డీలర్లకు హెల్త్‌ కార్డులు, కరాను సమయంలో చనిపోయిన రేషన్‌ డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు రేషన్‌ డీలర్షిప్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కూడా రేషన్‌ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రేషన్‌ డీలర్లకు క్వింటాల్కు ధర పెంచడం హర్షణీయం
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ కషితోనే రేషన్‌ డీలర్లను ఆదుకోవడం జరిగిందని తాండూరు మండల రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షులు ప్రకాష్‌ అన్నారు. గతంలో అనేక ఇబ్బందులతో పనిచేసిన రేషన్‌ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడం శుభ పరిణామం అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ కు రేషన్‌ డీలర్లు రుణపడి ఉంటారన్నారు.
ప్రకాష్‌,తాండూరు మండల రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షులు