– ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జిల్లా కార్యదర్శి సతీష్
– కొడంగల్‌కు చేరిన స్‌ఎఫ్‌ఐ సమరభేరి సంక్షేమ జీపు జాత
నవతెలంగాణ-కొడంగల్
సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పక్కా భవనాలను నిర్మించకపోతే ఉద్యమం తప్పదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జిల్లా కార్యదర్శి సతీష్ హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ సమర భేరి సంక్షేమ జీవుజాత మంగళవారం ఉదయం పరిగిలో మొదలై సాయంత్రానికి కొడంగల్‌కు ఎస్‌ఎఫ్‌ఐ యాత్ర బందం చేరింది. ఈ యాత్రకు అంబేద్కర్ యువజన సం ఘం నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) సంక్షేమ హాస్టల్ల పరిరక్షణకై జీపు యాత్ర పరిగి కొడంగల్ చౌరస్తా నుండి ప్రారంభించి హాస్టల్లో సమస్యలను తెలుసుకొని ఎస్‌ఎఫ్‌ఐ జీపు యాత్ర కొడంగల్‌కు చేరింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సతీష్, జిల్లా అధ్యక్షులు అక్బర్‌లు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లపై శ్రద్ధ పెట్టడం కరువైందని జిల్లాలోనీ ప్రభుత్వ హాస్టళ్లు అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో మ రుగుదొడ్లు శిథిలావస్థలో ఉన్నాయని, భగీరథ నీరు విద్యా ర్థులకు నీరు సరిపోవటం లేదన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని వెంటనే సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఎప్పటికప్పుడూ వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మెస్ చార్జీలను ధరలకు అనుగుణంగా పెంచాల న్నారు. గర్ల్స్ హాస్టల్‌లకు ప్రత్యేకంగా హెల్త్ కిట్స్ అందిం చాలని. హాస్టల్లో అప్లికేషన్ పెట్టిన ప్రతి విద్యార్థికి సీట్లు అందించేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కొన్ని అద్దె భవనాలు వర్షాలతో కురుస్తున్నాయని, పెచ్చులు ఉడిపోతు న్నాయని వాటికి ఉన్నత అధికారులు మరమ్మతులు జరపాలన్నారు. సంక్షేమ హాస్టల్‌లను ప్రభుత్వ ప్రజా ప్రతి నిధులు సందర్శిం చి సమస్యలను పరిష్కరించాల న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లకూ పక్కా భవనాలు నిర్మిం చాలని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్లో కనీస వసతులు కల్పించకపోవడం విడ్డూరమన్నారు. వర్షా ల వల్ల హాస్టళ్లు శిథిల వ్యవస్థలో ఉండడంతో విద్యార్థులు హాస్టల్స్ నుండి ఇంటికి వెళ్ళే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వనికే దక్కిందని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుండి పీజీ ఉచిత విద్య అందిస్తానన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేేశారు. హాస్టళ్లను సర్వే చేశారు. ‘మన ఊరు మన బడ’ి పాఠశాలలను కింద పాఠశాలలను అభివద్ధి చేయాలన్నా రు. హాస్టల్లో ప్రహరీ గోడ, ఫెన్సింగ్‌లనూ ఏర్పాటుకు ప్రభు త్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మెస్ చార్జీలను, కాస్మెటిక్ చార్జెస్‌ని పెంచాలని లేకపోతే భవిష్యత్తులో ఉద్య మాలను ఉదతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నవీన్, రాజు, రాజశేఖర్, మహిమూద్, శ్రీకాంత్, నితిన్, రాకేష్, అనిల్, పాటల గోపి, కళ్యాణ్, మధు తదితరులు పాల్గొన్నారు.