లారీ ఢకొీని వ్యక్తి మృతి

– ఇద్దరికి గాయాలు
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
లారీ ఢకొీని ఒకరు మతి చెంది గాయాలైన సంఘటన తాండూర్‌ పట్టణ కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తాండూరు పట్టణ సిఐ రాజేందర్‌ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్‌ గ్రామానికి చెందిన అక్కం లాలప్ప అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోగా వరుసకు అల్లుడైన కష్ణ నల్గొండ జిల్లా నుండి మంగళవారం రాత్రి చూడడానికి వచ్చి బుధవారం ఉదయం 3 గంటల ట్రైన్‌కు వెళ్ళుటకు తన స్నేహితులు అగు చెన్నారం నరేష్‌, దంతేవాడ లాలప్పలను తన బైక్‌ నెంబర్‌ టీఎస్‌ 34 ఏ 8049 గలదానిపై హాజీపూర్‌ నుండి తాండూర్‌ రైల్వే స్టేషన్‌కి వస్తుండగా రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పైన వెనుక నుండి వచ్చిన టిప్పర్‌ నెంబర్‌ ఏపీ 10 వి 1109 డ్రైవర్‌ తన టిప్పర్ను అతివేగం తో నడుపుకుంటూ వచ్చి మతుని వెనకాల నుండి టక్కరి ఇవ్వగా బైకు క్రిందపడి ఫిర్యాదుదారు కష్ణకు చెన్నారం నరేష్‌కు స్వల్ప గాయాలు కాగా దంతవాడ లాలప్పకు తలకు కుడి చేయికి కడుపుపై బలమైన రక్త గాయాలయి అక్కడికక్కడే మతి చెందాడు. కరణ్‌ కోట గ్రామం నుంచి ఒక వ్యక్తి ఆ లారీని దొంగతనం చేసి తాండూర్‌లో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి మీద అట్టి యాక్సిడెంట్‌ చేశాడు. అ వ్యక్తి ని కూడా గుర్తించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.