– సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకుల హెచ్చరిక
– శంషాబాద్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాపడావ్
– కేంద్రం కార్మిక చట్టాల జోలికి రావద్దని డిమాండ్
– ఐక్య పోరాటాల ద్వారా గద్దె దించుతామని హెచ్చరిక
నవతెలంగాణ-శంషాబాద్
కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తే ఖబడ్దార్ ఇక సహించేది లేదని కార్మిక ఐక్య పోరా టాల ద్వారా ప్రభుత్వాలను గద్దె దించుతామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఎన్. రాజు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఓ. యాదయ్య, పానుగంటి పర్వతాలు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలని బుధవారం శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యం లో మహా పడావ్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ టీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎన్. మల్లేష్, ఏఐటీ యూసీ మండల కన్వీనర్ నర్రగిరి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేం ద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లోకి మార్చి చట్టాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేటు సంస్థల ను తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవసాయ రంగంగా మార్చడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయని వాటిని నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరల కారణంగా కా ర్మికుల బతుకులు ఛిద్రమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికుల బతు కులు ఆగమైపోతున్నాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ సర్కారును గద్దేదించే వరకు విశ్ర మించేది లేదనిన్నారు. కార్మికులు తమ హక్కుల కోసం సం ఘటితమై వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా నాయకులు కిషన్, రవికుమార్, కు రుమయ్య, రుద్ర కుమార్, దేవేందర్, ప్రవీణ్, బాల్‌రాజ్, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. రామస్వామి జిల్లా మాజీ అధ్యక్షులు పుస్తకాల నర్సింగ్ రావు, రాష్ట్ర నా యకులు సయ్యద్ అప్సర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్షులు వడ్ల సత్యనారాయణ, వనంపల్లి జైపాల్ రెడ్డి, దత్తునాయక్, కె. చందుయాదవ్, టంగుటూరు నరసింహారెడ్డి సామిడి శేఖర్‌రెడ్డి హరిసింగ్ నాయక్ రామచంద్రయ్య, బుద్ధుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.