త్వరలో డాక్టర్లతో సమావేశం

– తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులతో రిజ్వీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమస్యల పరిష్కారం కోసం త్వరలో డాక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఏఎం.రిజ్వీ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాల యంలో రిజ్వీని కలిసి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రిజ్వీ మాట్లాడుతూ గవర్నమెంట్‌ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి త్వరలో వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ప్రతినిధులు డాక్టర్‌ లాలూ ప్రసాద్‌ రాథోడ్‌, డాక్టర్‌ పల్లం ప్రవీణ్‌, డాక్టర్‌ బొంగు రమేశ్‌ తదితరులు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్‌ తదితర విభాగాల వారీగా డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా రిజ్వీకి వివరించారు.