బాల పురస్కార్‌ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం-2024 కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల్ని కోరుతూ ప్రకటన జారీ చేసింది.శౌర్యం, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి, ఆవిష్కరణల్లో జాతీయస్థాయి గుర్తింపు పొంది ఉండాలి. భారతీయ పౌరులై, 18 ఏండ్ల లోపు చిన్నారులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వ్యక్తులు కూడా అర్హులైన పిల్లల్ని అవార్డులకు నామినేట్‌ చేయోచ్చు. దరఖాస్తుల్ని aషaతీసర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. ఈనెల 31వ తేదీ లోపు పూర్తిచేసిన దరఖాస్తుల్ని సమర్పించాలి. ఇతర వివరాలకు పై పోర్టల్‌లో చూడవచ్చు.