నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం వల్ల జరిగే లాభ, నష్టాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాష్ట్రఅధ్యక్షులు ఏఆర్ రెడ్డి, రాష్ర ్టప్రధానకార్యదర్శి యం.థామస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంటు యన్. కమలాకర్ గౌడ్, ఛీప్ అడ్వైజర్ యాదయ్య, కోశాధికారి ఆర్. రాఘవరెడ్డితో కూడిన బృందం ఆంద్రప్రదేశ్‌కు గురువారం బయలుదేరి వెళ్లింది. ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకాతిరుమలరావు, ఈడీలను కలిసి విలీనం విధివిధానాలపై సమాచారం తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఏపీజేఏసీ, ఆర్టీసీ ఈయూ నేతలను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అధ్యయన వివరాలను ప్రభుత్వానికి అందించనున్నట్టు థామస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.