ఆ ప్రాజెక్టు అనుమతులపై ఎంపీ రంజిత్‌ రెడ్డి హర్షం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల లభించడం పట్ల చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరబోతుందని తెలిపారు.. దీని ద్వారా చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని ఆరు నియోజక వర్గాలలో నీటి సమస్య తీరుతుందన్నారు. పర్యావరణ అనుమతుల కోసం కషి చేసిన సీఎం కేసిఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.