న్యూఢిల్లీ: అల్యూమినియం రైల్ వ్యాగన్లు, కోచ్‌లను తయారు చేసేందుకు హిందాల్కో, ఇంజనీరింగ్ కంపెనీ టెక్స్మాకో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దేశంలో ప్రపంచ స్థాయి తయారీ కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టున్నట్టు పేర్కొన్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా రైల్వేలకు తమ ఉద్గార లక్ష్యాలు చేరుకోవటం, ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవటంలో మద్దతును అందించనున్నట్టు తెలిపాయి. సరుకు రవాణా కార్స్ తయారీలో టెక్స్మాకోకు ఎనిమిది దశాబ్దాల అనుభవం ఉందని తెలిపింది. ఈ ఒప్పందంలో హిందాల్కో ఇండిస్టీస్ ఎండి సతీష్ పారు, టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ ఇంద్రజిత్ ముఖర్జీ పాల్గొన్నారు.