యుద్ధ ప్రాంతంలా నూహ్

నూహ్ నుంచి జె. జగదీశ్వరరావు ప్రత్యేక కథనం
– పదుల సంఖ్యలో భవనాలు కూలీపోయాయి
– కాంక్రీట్‌ దిమ్మలే కనబడుతున్నాయి
– అంతా సంఘ్ పరివార్‌ స్క్రిప్ట్‌ ప్రకారమే
ఇటీవల హర్యానాలోని నూహ్లో జరిగిన అల్లర్ల తరువాత ఆ ప్రాంతంలో యుద్ధమబ్బులు కమ్మేశాయి. హర్యానాలోని మేవాత్‌ షహీద్‌ హసన్‌ ఖాన్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లే నూహ్ రోడ్డుకు ఇరువైపులా భారీ బాంబు పేలుళ్లతో ధ్వంసమైన యుద్ధ ప్రాంతంలా కనిపిస్తోంది. పదుల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. భవనాల్లో మెడికల్‌ స్టోర్లు, ల్యాబ్‌లు ఉండేవి. వాటిపై బుల్డోజర్లు, భారీ ఆయుధాలు వారిపై పడ్డాయి. సంఘ్ పరివార్‌ స్క్రిప్ట్‌ ప్రకారం బీజేపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మూలనకు గుర్తుగా రాళ్లు, చెక్క దిమ్మలు, కాంక్రీట్‌ దిమ్మలు మాత్రమే మిగిలాయి. బాధితుడు నవాబ్‌ షేక్‌ ద్ణుఖం పట్టుకోలేక శిథిలాల మధ్య నిలబడి ఉన్నాడు. వీటిలో కొన్ని దుకాణాలు ఆయన భవనంలో ఉన్నాయి. వైద్య కళాశాల సమీపంలోని మసీదు స్థలం కూడా నవాబు ఇచ్చినదే. రోగులు, సమ్మేళనాల కోసం విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భూమిని అందించడానికి ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వచ్చిన వారు, అన్ని పత్రాలతో నిర్మించిన భవనాలను కూడా కూల్చివేశారని నవాబ్‌ తెలిపారు. అలాగే రెవెన్యూ అధికారులతో పాటు వచ్చిన పోలీసులు తనను కొట్టి వాహనం ఎక్కించారని నవాబ్‌ తెలిపారు. నవాబు, ఇతర వ్యాపారులు ఏం చేయాలో తెలియక రోజులు గడుపుతున్నారు. అధికారులు దాదాపు 60 దుకాణాలను ధ్వంసం చేశారని మసీదు ఇమామ్‌ ఖాలీద్‌ తెలిపారు. మసీదుకు విద్యుత్‌ కనెక్షన్‌ కూడా తెగిపోయింది. జులై 31న వైద్య కళాశాల ప్రాంగణం నుంచి సంఫ్‌ు పరివార్‌ సంస్థలు జలాభిషేక యాత్రను ప్రారంభించాయి. యాత్ర తొలిత స్నేహపూర్వకంగా ప్రారంభమైంది. యాత్రలో పాల్గొన్న వారికి వ్యాపారులు నీరు, ఆహారం అందించారు. ఖాలీద్‌ వద్దకు వచ్చిన తరువాత జరిగిన గొడవల ప్రారంభమైయ్యాయి. దీనివల్ల వ్యాపారులు నష్టపోయారని అన్నారు. మెడికల్‌ కళాశాల ఎదురుగా ఉన్న 2.6 ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చివేసి ముందస్తు నోటీసు ఇచ్చామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తమకు ముందస్తు నోటీసులు అందలేదని, మెడికల్‌ స్టోర్స్‌తో సహా లైసెన్స్‌తో నిర్వహిస్తున్నామని వ్యాపారులు తెలిపారు.