మిల్లింగ్‌ సామర్థ్యం పెంచేందుకు నిర్ణయం

– జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కోటి ఎకరాల్లో వరి సాగుతో ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిల్లింగ్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు (క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు) కమిటీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. మరో నలుగురిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.