
గొంది మల్లారెడ్డి నర్సమ్మ మెమోరియల్ ట్రస్ట్ సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గొంది మల్లారెడ్డి నర్సమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డి శుక్రవారం మండల కేంద్రంలోని వరద బాధితులకు ఎమ్మెల్యే సీతక్క చేతుల మీదుగా బెడ్ షీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సితక్క మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం చేయడం గొప్ప వరమని అన్నారు. వరద బాధితులకు నరసింహ రెడ్డి బెడ్ షీట్లను పంపిణీ చేయడం హర్శించదగ్గ విషయమని అన్నారు. అకాల వర్షాలుపడి, వరదలతో ఇల్లు మునిగి, కట్టు బట్టలతో, ప్రాణాలతో బయటపడ్డ, బాధితులను ఆదుకోవడానికి, వచ్చిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, అందరికీ మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, ఎంపీటీసీ ఏడుకొండలు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చిత్తు ,గ్రామ అధ్యక్షుడు అర్ వెంకటేశ్వర్ రావు, జంపాల చంద్ర శేకర్,మహిళా నాయకులు, నాగమని, పులు సం లక్ష్మి, ట్రస్ట్ సభ్యులు, ప్రశాంత్, విజయ కాంత్, మహేష్, దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.