– నానక్‌నగర్‌లో ఆమె అంత్యక్రియలు
నవతెలంగాణ-యాచారం
యాచారం మండల పరిధిలోని నానక్ నగరంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ మాతృమూర్తి కందుకూరి లక్ష్మమ్మ గురువారం రాత్రి చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి లక్ష్మమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియలల్లో ప్రముఖులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు మర్రి నిరంజన్ రెడ్డి, ఎంపీపీ సుకన్య భాషా, ఎంపీడీవో విజయలక్ష్మి, బీఆర్‌ఎస్ మండ లాధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పాశ్చ, బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, సర్పం చులు, ఎంపీ టీసీలు, అధికారులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.