బ్రిజ్‌ భూషణ్‌ను విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలు వున్నారు !

–  కోర్టుకు తెలియచేసిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ : మహిళా రెజర్లను లైంగికంగా వేధించిన కేసులో బిజెపి ఎంపి, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు అయిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను విచారించడానికి తగినన్ని సాక్ష్యాధారాలు వున్నాయని ఢిల్లీ పోలీసులు శుక్రవారం మెట్రోపాలిటన్‌ కోర్టుకు తెలియచేశారు. సింగ్‌, సహ నిందితుడిపై ప్రాధామిక సాక్ష్యాధారాలు కలిగిన కేసు నమోదైందని, డబ్ల్యుఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ను సస్పెండ్‌ చేశామని నగర పోలీసులు అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ హర్‌జీత్‌ సింగ్‌ జస్పాల్‌కు తెలియచేశారు. నిందితులపై చార్జిషీట్లు దాఖలు చేశామని పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ కోర్టుకు చెప్పారు.