– 40 తులాల బంగారు ఆభరణాలు చోరీ
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని వసంత్ సిటీ విలాస్‌లో చెడ్డి గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ హైటెక్స్ రైల్వే ట్రాక్ సమీపంలో గల వసంత్ విల్లాస్‌లో చెడ్డి గ్యాంగ్ చొరబడింది. ఆ ఇండ్లలో సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. రెండ్రోజుల కిందట జరిగిన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చెడ్డి గ్యాంగ్ చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.