– బాలికపై తండ్రీకొడుకుల లైంగికదాడి
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికలపై ఆకృత్యాలు ఆగడం లేదు. లైంగికదాడుల పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని కొంపల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కొన్నాళ్ల కిందట కొంపల్లికి ఓ కుటుంబం వలస వచ్చింది. వారికి ఏడేండ్ల బాలిక ఉంది. తల్లిదండ్రులు పాపను పొరుగింటి వారిని చూసుకోమని అప్పగించి పనికి వెళ్లారు. అయితే, పక్కింట్లో ఉండే శివకుమార్, అతని కుమారుడు ఫైజల్ బాలికకు ఫోన్ ఆశ చూపించి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ లైంగికదాడి చేశారు. సాయంత్రం తల్లిదండ్రులు వచ్చేసరికే బాలిక నొప్పితో విలవిల్లాడటాన్ని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. శివకుమార్, అతని కుమారుడు శ్యామెల్ చేసిన దారుణాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. మెరుగైన చికిత్స కోసం పాపను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.