
యూత్ ఫెస్ట్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా నెక్లెస్ రోడ్ లో రాష్ట్ర స్థాయి లో ఏర్పాటు చేసిన 5కే రెడ్ రన్ లో నిజామాబాద్ జిల్లా లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్ (మాణిక్ బండ ర్) లో చదువుతున్న విద్యార్థి గుర్రపు రోజా కు ద్వితీయ స్థానం రావడం జరగింది. అందుకు గాను 250000 అక్షరాల ఇరువది ఐదు వేలు) నగదు తో పాటు మేమొంటో మరియు సర్టిఫికేట్ డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి, టీవీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, పిడిటిఎస్ఏసిఎస్ హైమావతి ఐఏఎస్ చేతుల మీదుగా శనివారం అందుకున్నారు. జిల్లాకు ద్వితీయ స్థానం రావడం అభినందనీయమని సంబంధిత అధికారులు శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.