డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరుతో జర్నలిస్టుల సంబురాలు

– సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం
నవతెలంగాణ-వీణవంక
గత రెండు దశాబ్దాలకు పైగా పరిష్కారం కాని జర్నలిస్టుల సొంతింటి కల నేరవేరుతుండడంతో జర్నలిస్టులు ఆదివారం సంబురాలు చేసుకున్నారు. మండల కేంద్రంలో వివిధ పత్రికలల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కావడం, పట్టాల పంపిణీ కావడంతో మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీకి పలువురు పాత్రికేయులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 20 ఏండ్లకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాగా పని చేస్తున్నామన్నారు. కానీ సొంతింటి కల నెరవేరలేదని, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయడంతో పట్టాలు అందించడంతో తమ కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసిన ఇందుకోసం కృషి చేసిన  ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్లు ఆర్ వీ కర్ణన్, గోపి, ఆర్డీవోలు, తహసీల్దార్లకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీల కుమారస్వామి, జర్నలిస్టులు కట్ట రాజు, దాసారపు రాధాకృష్ణ, గెల్లు శ్రీనివాస్, మిడిదొడ్డి పరుషరాం, ఎండీ రజాక్, పులాల శంకర్, పల్లకొండ సుధాకర్, జగన్నాథుల సత్తీష్, యార కుమార్, ఎండీ నజీమొద్దీన్, నాయకులు సంపత్ రెడ్డి, ప్రకాష్, దావుద్ తదితరులు పాల్గొన్నారు.