నడిచే పొద్దు నేలకు ఒరిగిందా !?

అతడో మహోద్యమాల వేదిక
అన్యాయాలపై ప్రజా యుద్ధ గొంతుక
ప్రత్యామ్నాయ పోరాటల నౌక
పాదంమీద పుట్టు మచ్చైన
ప్రేమానుబంధాల వేడుక
ఆయన పాటొక కలకత్తా కాళికా నాలుక
బడుగు బలహీన వర్గాల చైతన్య మూలిక

పోరాటం అతని చిరునామా
ప్రశ్న అతని మాట.. ధిక్కారం అతని పాట..
రాజ్యం గుండెల్లో ఎక్కుపెట్టిన తూట
వెరసి గద్దర్‌

అవును …
ఇప్పుడు సిరిమల్లెచెట్టు కింద
లచ్చుమమ్మ సినబోయే కూచుంది

తెలంగాణ సిరిమువ్వ మూగబోయిందా!?
గోసి గొంగడి పాటకు వందనం
గద్దరన్నా ఓ గద్దరన్నా… లాల్‌ నీల్‌ వందనం.

రాజ్యం బుల్లెట్‌నే
భయపెట్టిన పాటల బుల్లెట్‌ వి నువ్వు
నినదించే నీ ఉద్యమ గొంతులో
బుల్లెట్‌ కూడా నిదురపోయింది
ఏడేడు రంగుల సింగడి తెలంగాణ గానమా …!
మహోదయమా…!!
గద్దరన్న నీ మరణం చివరి చరణం కాదు
నీ పాటకు మరణం లేదు
నీ పోరు పేరు అమరత్వం
– శిఖాఆఖాష్‌, తంగిరాల. సోని
9676609234