పోలీస్‌ ఉద్యోగంలో ఆదర్శంగా నిలవాలి

Be exemplary in police work– కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాపోలు నర్సింలు, సంఘం మండల అధ్యక్షుడు మద్దూర్‌ పాండు
నవతెలంగాణ-షాబాద్‌
పోలీస్‌ ఉద్యోగంలో ఆదర్శంగా నిలిచి కురుమ కులానికి మంచి పేరు తీసుకురావాలని కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు మండల అధ్యక్షుడు మద్దూర్‌ పాండులు అన్నారు. షాబాద్‌ మండలం ఎంకమ్మగూడ గ్రామానికి చెందిన జీవాల రాజేందర్‌, బోడంపాడు గ్రామానికి చెందిన మిర్యాల మల్లేష్‌లు ఎస్సైలుగా సెలెక్ట్‌ కావడంతో ఆదివారం కురుమ సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతంగా చదివి పోలీస్‌ ఎస్సైకి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగంలో ఆదర్శంగా నిలిచి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కారు చిన్నయ్య, సలహాదారులు ఒగ్గు రాజు, మాజీ అధ్యక్షులు కాట్న సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు మీసాలు వెంకటయ్య, కార్యదర్శి సిద్దాపురం శివ, దామల్రపల్లి సర్పంచ్‌ లింగం, సర్పంచ్‌ వెంకటేష్‌, యూత్‌ అధ్యక్షులు కూతురు మహేందర్‌, ఉపాధ్యక్షులు వీరంపల్లి యాదయ్య, బర్క శ్రీశైలం, సలహాదారులు బర్క సాయిలు, బర్క నరేందర్‌, మల్లేష్‌, రమేష్‌, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.