– చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని సిహెచ్ ఆర్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అందరూ అండగా నిలబడాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని నమ్మకం ఉందని, కచ్చితంగా పోటీలో ఉంటానని కార్యకర్తలే గెలిపించుకోవాలని కోరారు. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు చేవెళ్ల ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఇంద్రారెడ్డి తనకు రాజకీయ గురువు అని అంచలంచలుగా ఎదిగి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీతో గెలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీపీ మంగలి బాల్ రాజ్, మాజీ సర్పంచ్ లు రామ్ చంద్రయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శివానందం, నాయకులు భూపతి రెడ్డి, లక్ష్మికాంత్ రెడ్డి, మాణిక్య రెడ్డి, శంకర్, పాండు తదితరులు పాల్గొన్నారు.