నవతెలంగామ బ్యూరో – హైదరాబాద్
మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ కోసం నిస్వార్థంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలను, ధైర్యాన్ని స్మరించుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారతీయులు మరింత మెరుగైన జీవితం కోసం ప్రారంభించిన అమ్రిత్ కాల్‌కు ఏడాదైందని ఆమె గుర్తు చేశారు. మెరుగైన భారత నిర్మాణానికి అంకితభావంతో పని చేయాలని కోరారు. స్వయం సాధికారత, నాణ్యమైన విద్య, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వృద్ధితో అందరికి లబ్ది చేకూరుతుందని వివరించారు.