కేసీఆర్ ని కలిసిన క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ డి.రాజేశ్వర్ రావు

నవతెలంగాణ- కంటేశ్వర్

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ గా డి.రాజేశ్వర్ రావు నియమితులైన తరువాత మొదటిసరిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని గురువారం ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు, తనకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేసీఆర్ మార్గదర్శకo లో క్రిస్టియన్ల అభివృద్ధి కై కృషి చేస్తానన్నారు, డి రాజేశ్వర్ గతంలో మూడుసార్లు ఎమ్మెల్సీ గా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా రెండుసార్లు నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ పనిచేయడం జరిగిందని, తన 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కోసం పనిచేశానని అన్నారు.