
నవతెలంగాణ – తాడ్వాయి
ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క శుక్రవారం భారీ వర్షం కురుస్తుండగా కూడా వర్షం లెక్కచేయకుండా పేద ప్రజల కోసం తాడ్వాయి మండలంలో విస్తృతంగా పర్యటించి, పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. బీరెల్లి గ్రామానికి చెందిన జాజ సమ్మక్క వారి కుటుంబాన్ని పరామర్శించారు. అంకంపల్లి సర్పంచ్ వట్టం సావిత్రి బాలరాజు లు బైక్ పై నుండి పడి అనారోగ్యంతో ఉండడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. నర్సాపూర్ (పిఏ) గ్రామానికి చెందిన ఈసం సమ్మక్క, నాలి పుల్లయ్య, సునారికాని మల్లయ్య లు మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలియజేశారు, వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జవ్వాజి రాజు అనారోగ్యంతో బాధపడడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అనంతరం కాటాపూర్ గ్రామంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకొని అనారోగ్యంతో ఉండగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. పలు కుటుంబాలను పరామర్శించి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, కాటాపూర్ మాజీ సర్పంచ్ ముజాఫర్ హుస్సేన్, సీనియర్ నాయకులు అర్రెం లచ్చు పటేల్, సర్పంచ్ లు ఇర్ప సునీల్ దొర, ఇర్ప అశ్విని సూర్యనారాయణ, నరసింహస్వామి, బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాయ వెంకటేశ్వర్లు(కోడి), శివానంద్ స్వామి, మేడిశెట్టి ఆనందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

