
ఆళ్ళపల్లి, గుండాల మండల కేంద్రాలతో పాటు మర్కోడు గ్రామంలోని గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా ఆళ్ళపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో గౌడ కులస్తులు అంతా తమ వృత్తిలో భాగమైన మోకు, ముస్తాదులతో అధిక సంఖ్యలో పాల్గొని గ్రామమంతా మారుమోగేలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కులపెద్ద తాళ్లపల్లి వెంకన్న సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి, జెండా ఆవిష్కరించారు. తదనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన గౌడ సభలో మండల అధ్యక్షుడు కాసబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సంఘ పెద్ద మనుషులు వెంకన్న, తాళ్లపల్లి రామ్మూర్తి, నవీన్, ఉప సర్పంచ్ కుర్ర కమల మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరిస్తూ ఆయన అడుగుజాడల్లోనే ముందుకు వెళ్లాలని, కులస్తులంతా ఐకమత్యంగా ఉండాలని, ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ కులస్తులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని చెప్పారు. అలాగే గౌడ కులస్తులకు ఐదు ఎకరాల భూమిని ఇచ్చి తాటి చెట్లను పెంచే విధంగా చూడాలని, ఏదైనా ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఏజెన్సీలు కూడా సొసైటీని ఇచ్చి గౌడ కులస్తులకు పింఛను వచ్చేలా చూడాలని, మన హక్కులను మనం కాపాడుకోవడానికి వారన్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు గౌడ సంఘం గురించి పాటను రాసిన పాటను పాడిన ప్రొడ్యూసర్ బైరు ప్రసాద్, ముత్తాపురం ఉపాధ్యాయుడు శంకర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బత్తిని వెంకటేశ్వర్లు, శ్రీరాం సమ్మయ్య, తిరుపతి, సాయన్న, రాజన్న, బుర్ర వెంకన్న, బూర్ణ రాంబాబు, రడం మల్లికార్జున్, బూర్ణ సతీష్, కోతి చంద్రశేఖర్, తాళ్లపల్లి శ్రావణ్, కొంపెల్లి సాంబయ్య, వగలబోయిన సతీష్, తాళ్లపల్లి శేఖర్, తాళ్లపల్లి సాయన్న, తాళ్లపల్లి రవి, మహిళలు పాల్గొన్నారు.