
వర్షాలు వరదల పట్ల ప్రజలు అప్రమత్త తో ఉండాలని పసర పోలీస్ స్టేషన్ సీఐ శంకర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ముందు జాగ్రత్తగా గతంలో వరదల ముంపుకు గురైన అభ్యుదయ కాలనీ ప్రాజెక్టు నగర్ ప్రాంతాలను పసర సి ఐ శంకర్ మరియు ఎస్ ఐ ఎస్.కె మస్తాన్ లు సందర్శించడం జరిగింది. గతంలో వరదల వల్ల జరిగిన నష్టం మరియు అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఉండాలని తగు సలహాలు సూచనలు చేశారు. ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంప్రదించాలని సూచించారు. వర్షాలు మరో రెండు రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ పేర్కొన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేందుకు సమయం కేటాయించాలని అన్నారు. అవసరమైతే వెంటనే తమను సంప్రదించాలని అన్నారు.