
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల ఉపాధ్యక్షుడు రంగు మురళీ, మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై ఝాన్సీ రెడ్డిని కార్యకర్తలు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సైనికుల పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, రెడ్డికుంట తండా సర్పంచ్ జగ్గా నాయక్, సీనియర్ నాయకులు తోటకూర శ్రీనివాస్, పట్టణ యువత అధ్యక్షుడు అనపురం వినోద్ గౌడ్, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గద్దల స్వామి, కార్యదర్శి కర్ణాకర్ రెడ్డి, జలాలుద్దీన్, జాటోత్ వెంకన్న, పన్నీరు వేణు, యూత్ నాయకులు ఆవుల మహేష్, నిమ్మల స్వామి, శ్రీరామ్ సాంబి, రామ్ చరణ్, సతీష్
తదితరులు పాల్గొన్నారు.