కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

– మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్
నవతెలంగాణ పెద్దవంగర
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు తోటకూర శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అవుతాపురం గ్రామ నూతన కమిటీ ఎన్నికకు వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై ఝాన్సీ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ దేనని, పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలుగా కృషి చేయాలి అన్నారు. కాగా గ్రామ నూతన అధ్యక్షుడిగా కాసోజు సోమాచారి రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూత్ అధ్యక్షుడిగా ఆలేటి మధు తో పాటుగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.